బార్ కౌన్సిల్ కొత్త పాలకులకు సన్మానం

బార్ కౌన్సిల్ కొత్త పాలకులకు సన్మానం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ గా ఎన్నికైన సాముల రాంరెడ్డి, వైస్ చైర్మన్ చలకాని వెంకట యాదవ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ గా ఎన్నికైన జి. కిరణ్ కుమార్ తోపాటు ఇతర సభ్యులను బుధవారం సాయంత్రం హైకోర్టు బార్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఏజీ సుదర్శన్ రెడ్డి, పీపీ పల్లె నాగేశ్వరరావు, అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహాశర్మ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. సురేందర్​రెడ్డి, ఉపాధ్యక్షుడు డి.ఎల్. పాండు, కార్యదర్శులు శ్రావణ్ కుమార్, నిరంజన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.